: ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినట్టే: సుజనా చౌదరి
కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ న్యాయబద్ధంగా చేయాలని టీడీపీ నేత సుజనా చౌదరి డిమాండ్ చేశారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, స్వంత సీఎం, కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు వ్యతిరేకిస్తుంటే వారిని ఒప్పించకుండా విభజనకు తొందర ఏంటని ప్రశ్నించారు. ఈ రీతిలో విభజనకు ఏమాత్రం అంగీకరించినా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినట్టేనని సుజనా అన్నారు. విభజనను తాము వ్యతిరేకించడం లేదని, అందర్నీ ఒప్పించి విభజన చేయాలని మాత్రమే తాము కోరుతున్నామని ఆయన సూచించారు.