: ప్రతి క్రీడలోనూ కుంభకోణాలు జరుగుతున్నాయి: విజయ్ మాల్యా
ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ వ్యవహారాలపై జస్టిస్ ముకుల్ ముద్గల్ కమిటీ సమర్పించిన నివేదికపై బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ యజమాని విజయ్ మాల్యా స్పందించారు. ప్రతి క్రీడలోనూ కుంభకోణాలు ఓ భాగంగా మారాయని వ్యాఖ్యానించారు. అయితే, సంపన్న క్రికెట్ క్రీడగా మారిన ఐపీఎల్ బ్రాండ్ ఇమేజ్ ను స్కాంలు ఏమి చేయలేవన్నారు. 'ప్రతి క్రీడలో బెట్టింగ్, ఫిక్సింగ్ లు సర్వ సాధారణమయ్యాయి. ఎన్ని ఆరోపణలు వచ్చినా ఐపీఎల్ కు బ్రాండ్ ఇమేజ్ పెరుగుతూనే ఉంది. కానీ, అలాంటి స్కాంలు చోటు చేసుకోవడం దురుదృష్టకరం' అని బెంగళూరులో జరుగుతున్న ఐపీఎల్ వేలం సమయంలో మాట్లాడారు.