: బంగారం వ్యాపారుల్లో 80 శాతం మంది మోసగాళ్ళేనట!
ధర పెరిగే కొద్దీ బంగారంపై మోజు కూడా పెరిగిపోతుంది. దీన్ని అదనుగా భావించి కొంతమంది బంగారం వ్యాపారులు ప్రజలను మోసం చేస్తున్నట్లు తేలింది. అభరణాల తూకంలో అక్రమాలకు పాల్పడుతున్నట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో, ఈ రోజు తూనికలు, కొలతల శాఖ అధికారి ఆర్ పీ ఠాగూర్ హైదరాబాదులోని బంగారం దుకాణాలపై దాడులు నిర్వహించారు.
హిమాయత్ నగర్ నగల దుకాణంలో తూనికల్లో తేడాలున్న రూ.22 లక్షల విలువైన నగలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మాట్లాడిన ఠాగూర్, నగరంలో 80 శాతం బంగారం వ్యాపారులు వినియోగదారులను మోసం చేస్తున్నారని తెలిపారు. బంగారం కొనుగోలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఆయన సలహా ఇచ్చారు.