: అంతరం పెరిగిపోయింది, కలిసి ఉండలేం: ఎంపీ పొన్నం
సీమాంధ్ర, తెలంగాణ మధ్య అంతరం పెరిగిపోయిందని, ఇక కలిసి ఉండలేమని ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. కాబట్టి, బిల్లు ఆమోదానికి సీమాంధ్ర ఎంపీలు సహకరించాలని కోరారు. తీవ్ర గందరగోళం మధ్య లోక్ సభ రేపటికి వాయిదా పడిన తర్వాత ఎంపీ పొన్నం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. సభలో నిరసన చేస్తున్న సీమాంధ్ర నేతలు అనవసరంగా తమను రెచ్చగొట్టవద్దన్నారు.