: సెల్ ఫోన్ల విషయంలో ఓ విషయం కన్ఫర్మ్ అయింది!


రెండు దశాబ్దాల క్రితం మనదేశంలో సెల్ ఫోన్ ఉన్న వ్యక్తులను వెతికిపట్టుకోవడం అత్యంత ప్రయాస అనుకుంటే, నేడు, సెల్ ఫోన్ లేని వ్యక్తులను చూపించమంటే ఎక్కడో మారుమూల ప్రాంతాలకు వెళ్ళాల్సి ఉంటుంది. అంతలా వేళ్ళూనుకుపోయిన ఈ కమ్యూనికేషన్ సాధనంపై కొన్ని అపోహలూ లేకపోలేదు. ముఖ్యంగా, దాన్నుంచి విడుదలయ్యే రేడియేషన్ క్యాన్సర్ కారకమవుతుందని, బ్రెయిన్ ట్యూమర్లు కలిగిస్తుందని నిపుణులు తొలినాళ్ళలో హెచ్చరించారు. తాజాగా, బ్రిటిష్ పరిశోధకుల అధ్యయనం అవన్నీ అపోహలే అంటోంది. మొబైల్ టెలీకమ్యూనికేషన్స్ అండ్ హెల్త్ రీసెర్చ్ ప్రోగ్రామ్ (ఎంటీహెచ్ఆర్) లో భాగంగా ఈ అధ్యయనం చేపట్టారు. సెల్ ఫోన్లు, టవర్లు విడుదల చేసే రేడియేషన్ గర్భవతులకు ఎలాంటి హాని తలపెట్టదని, పిల్లల్లో క్యాన్సర్ ను కలిగించదని, ల్యుకేమియాను తీవ్రతరం చేయదని పరిశోధకులు స్పష్టం చేశారు. ఈ విషయమై వారు దశాబ్దానికి పైగా అధ్యయనం సాగించారట.

  • Loading...

More Telugu News