: సమైక్యాంధ్ర నినాదాలతో.. రైల్వే బడ్జెట్ ప్రసంగాన్ని అడ్డుకున్న ఎంపీలు


కేంద్ర మంత్రి మల్లికార్జున ఖర్గే సభలో రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టి, బడ్జెట్ లోని అంశాలను లోక్ సభ సభ్యులకు చదివి వినిపించారు. ఆయనను చుట్టుముట్టేందుకు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎంపీలు ప్రయత్నించారు. అయితే, ఖర్గేకు రక్షణ కవచంగా తెలంగాణ ఎంపీలు నిలిచారు. దాంతో సీమాంధ్ర నినాదాల మధ్యే ఖర్గే రైల్వే బడ్జెట్ ప్రసంగాన్ని సభకు చదివి వినిపించారు. తర్వాత ఖర్గే రైల్వే బడ్జెట్ ను అర్థాంతంగా ఆపివేసి.. బడ్జెట్ ను సభకు సమర్పిస్తున్నట్లు చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఆరుగురు ఎంపీలు సోనియాగాంధీ ముందు వరుసగా నిలబడి ప్లకార్డులను ప్రదర్శించారు. కొందరు ఎంపీలైతే సభాపతి పోడియం వద్దకు వెళ్లి తమ నిరసన తెలిపారు. సమైక్యాంధ్ర, తెలంగాణ నినాదాలతో లోక్ సభ హోరెత్తింది. సభాపతి లోక్ సభను రేపటికి వాయిదా వేశారు.

  • Loading...

More Telugu News