: అసోం నేతలు ఎంతో గౌరవనీయులు: ఎన్ఎస్జీ చీఫ్
అసోంలో రాజకీయ నేతలు ఎంతో హుందాగా, గౌరవంతో వ్యవహరిస్తారని ఆ రాష్ట్ర మాజీ డీజీపీ, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ డైరెక్టర్ జనరల్ జయంతో నారాయణ్ చెప్పారు. అసోంలో పనిచేసినప్పుడు తన విధుల్లో రాజకీయ నేతలు జోక్యం చేసుకోలేదని, వారు తనపై ఒత్తిడి తీసుకురాలేదని తెలిపారు. ఒకవేళ వారికి ఏమైన అవసరాలు వచ్చినా వినయంగా అడిగేవారే కానీ, బలవంతపెట్టేవారు కాదన్నారు. వారు చెప్పినవి చేయకపోయినా.. అంగీకరించేవారని తెలిపారు. జయంతో నారాయణ్ 1978 బ్యాచ్ అసోం-మేఘాలయ కేడర్ కు చెందిన ఐపీఎస్ అధికారి.