: లోక్ సభ సాక్షిగా మన ఎంపీలు కొట్టుకున్నారు!


లోక్ సభ రణరంగాన్ని తలపించింది. వ్యూహ ప్రతి వ్యూహాలతో గతంలో ఎన్నడూ లేని రీతిలో లోక్ సభ కనిపించింది. తొలి సారి ఎంపీలు ఘర్షణకు దిగారు. గతంలో వాగ్వాదాలతో సరిపెట్టుకున్న ఎంపీలను తెలంగాణ బిల్లు ఘర్షణకు దిగేలా చేసింది. తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎంపీలు ముష్టి ఘాతాలకు దిగారు. టీఆర్ఎస్ ఎంపీ మంధా జగన్నాధం టీడీపీ ఎంపీ మోదుగులను తోసేయడంతో వారి మధ్య ఘర్షణ రేగినట్టు సమాచారం. వారిని వారించేందుకు శరద్ యాదవ్ ప్రయత్నించారు. తొలిసారి సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు పోడియం వద్దకు వచ్చి నిరసన తెలిపారు. మరో వైపు ఎంపీ హర్షకుమార్, లగడపాటి రాజగోపాల్ సాక్షాత్తూ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఎదుటే ఆందోళన చేశారు. సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్ కూడా పోడియం వద్దకు వచ్చి నినాదాలు చేశారు.

  • Loading...

More Telugu News