: శాసనసభ రేపటికి వాయిదా


ఈ ఉదయం వాయిదా అనంతరం ప్రారంభమైన శాసనసభ ఐదు నిమిషాలపైన మాత్రమే జరిగి రేపటికి వాయిదా పడింది. సభ మొదలైన వెంటనే ఆర్థికమంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి వివిధ ప్రభుత్వ బిల్లులను ప్రవేశపెట్టారు. ఇదే సమయంలో సమైక్యాంధ్ర, తెలంగాణ సభ్యులు నినాదాలు చేస్తున్నారు. బిల్లులు సభ ఆమోదం పొందగానే సభాపతి నాదెండ్ల మనోహర్ రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అంతకుముందు సభ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ఆమోదించింది.

  • Loading...

More Telugu News