: సీఎంవో అధికారులపై ఎమ్మెల్యే చిందులు
ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) అధికారులపై రంగారెడ్డి జిల్లా తాండూరు ఎమ్మెల్యే పి.మహేంద్రరెడ్డి చిందులు తొక్కారు. తాను డిమాండ్ చేస్తున్న పనులు ఎందుకు చేయడం లేదంటూ సీఎంవో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలనే తనకు సంబంధించిన పనులను తొక్కిపెడుతున్నారని తీవ్ర పదజాలంతో విమర్శలకు దిగారు. దీనిపై సీఎంవో అధికారులు అభ్యంతరం వ్యక్తం చేసినట్టు సమాచారం.