: భారత్ లో ఎన్నికలపై కొలంబియాలో వెబ్ సైట్ ప్రారంభం
భారత్ లో జరగనున్న ఎన్నికల మహా సంగ్రామంపై సమగ్ర వివరాలను అందించేందుకు అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీ విద్యార్థులు ప్రత్యేకంగా ఒక వెబ్ సైట్ ను ప్రారంభించారు. భారత సంతతికి చెందిన ఆరుగురు జర్నలిజం విద్యార్థులు FiveFortyFive.Com సైట్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. 545ను ఇంగ్లిష్ అక్షరాల్లో వెబ్ సైట్ గా తీసుకురావడానికి కారణం.. లోక్ సభలో సీట్లు 545 ఉండడమేనని వారు చెప్పారు. ఎన్నికలు అంటే కేవలం రాజకీయ నాయకులకు సంబంధించిన విషయమే కాదని, విద్యార్థులు, మేథావులు, విద్యావేత్తలు, నిపుణులు అందరినీ ఇందులో భాగస్వాములు చేయాలన్నది వీరి అభిప్రాయం. ఎన్నికలకు సంబంధించిన వార్తలను నిష్పక్షపాతంగా అందిస్తామని వీరు చెబుతున్నారు. అయితే, ఈ సైట్ లో ఇంకా ఎటువంటి సమాచారాన్ని పొందుపరచలేదు.