: పార్లమెంటు ప్రాంగణంలో టీడీపీ నేతల ధర్నా.. అరెస్ట్
దేశ రాజధాని హస్తినలో రాష్ట్ర విభజన అంశంపై నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇవాళ (బుధవారం) పార్లమెంటు భవనం వద్ద ఉద్రిక్తత నెలకొంది. వెంటనే తెలంగాణ బిల్లును ఉభయ సభల్లో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తెలంగాణ నాయకులు తమ నిరసన తెలియజేశారు. తెలంగాణ బిల్లు వెంటనే ప్రవేశపెట్టాలని నినాదాలు చేస్తూ పార్లమెంటు ప్రాంగణంలో ధర్నాకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే అక్కడకు చేరుకుని వారిని ధర్నాను విరమించాలని కోరినా వినలేదు. దాంతో టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.