: రూ.12.5 కోట్లకు దినేశ్ కార్తీక్ ఢిల్లీ డేర్ డెవిల్స్ సొంతం
ఐపీఎల్ వేలం పాటలో యువరాజ్ సింగ్ తర్వాత దినేశ్ కార్తీక్ అత్యధిక ధర పలికాడు. ఢిల్లీ డేర్ డెవిల్స్ 12.5కోట్ల రూపాయలతో అతడిని సొంతం చేసుకుంది. మిచెల్ హుస్సే కనీస ధర రూ.2కోట్లు కాగా, అతడికి 5 కోట్లు ఆఫర్ చేయడం ద్వారా హైదరాబాద్ సన్ రైజర్స్ దక్కించుకుంది. అమిత్ మిశ్రా 4.75కోట్లు పలికాడు. బ్రెండాన్ మెక్ కల్లమ్ కు చెన్నై సూపర్ కింగ్స్ 3.25కోట్లు చెల్లించడానికి ఆసక్తి చూపింది. దక్షిణాఫ్రికాకు చెందిన ఫ్రాంకోయిస్ ప్లెస్సిస్ ను రూ.4.75 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ ఎగరేసుకుపోయింది. వెస్టిండీస్ ఆల్ రౌండర్ డారీ సామీకి హైదరాబాద్ సన్ రైజర్స్ రూ.3.50కోట్లు ఆఫర్ చేసింది. మనోజ్ తివారీ రూ.2.8కోట్లు(ఢిల్లీ డేర్ డెవిల్స్), షాన్ మార్స్ రూ.2.20కోట్లు(కింగ్స్ 11 పంజాబ్), బ్రాడ్ హోడ్జే రూ.2.40కోట్లు (రాజస్థాన్ రాయల్స్), రాబిన్ ఊతప్ప రూ.5 కోట్లు (కోల్ కతా నైట్ రైడర్స్), చటేశ్వర్ పుజారా రూ.1.90కోట్లు (కింగ్స్ 11 పంజాబ్) పలికారు.