: పోలీసు అధికారిపై దాడి కేసులో మహారాష్ట్ర ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు
పోలీసు అధికారిపై దాడి చేసిన వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు మహారాష్ట్ర ఎమ్మెల్యేలపై వేటు పడింది. డిసెంబర్ 31 వరకు అసెంబ్లీకి హాజరుకావద్దంటూ స్పీకర్ వారిని సభ నుంచి బహిష్కరించారు. బహుజన వికాస్ అగడి ఎమ్మెల్యే క్షితిజ ఠాకూర్, మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన ఎమ్మెల్యే రామ్ కదమ్, శివసేన నేత రజన్ సాల్వై, బీజెపి నేత జై కుమార్ రావల్, స్వతంత్ర అభ్యర్ధి ప్రదీప్ జైశ్వాల్ పై ఈ చర్యలు తీసుకున్నారు.