: వైద్యరంగంలో సరికొత్త ఆవిష్కరణ
టెక్నాలజీ రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. వైద్య రంగంలో సరికొత్త ఆవిష్కరణ అనదగ్గ ప్రత్యేకమైన కళ్ళద్దాలను అమెరికాలోని వాషింగ్టన్ యూనివర్శిటీ పరిశోధకులు రూపొందించారు. దీనిద్వారా వైద్యులు క్యాన్సర్ కణాలను స్పష్టంగా చూడవచ్చు. తద్వారా శస్త్రచికిత్స వేళ క్యాన్సర్ కణాలు స్పష్టంగా కనిపించడం వల్ల వాటిని తొలగించడం వైద్యులకు సులువవుతుంది. వీటిని ధరించినప్పుడు క్యాన్సర్ కణాలు నీలి రంగులో కనిపిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ టెక్నాలజీ ప్రాథమిక దశలోనే ఉందని, దీన్ని మరింత మెరుగుపరిచి ఈ ప్రత్యేక కళ్ళద్దాలను అందుబాటులోకి తెస్తామని వారు తెలిపారు.