: ప్రజలను, పార్టీ శ్రేణులను, నేతలను కాంగ్రెస్ అధిష్ఠానం మోసగిస్తోంది: తులసిరెడ్డి
కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం సీమాంధ్ర ప్రజలను, సీమాంధ్రలో పార్టీ శ్రేణులను, సీమాంధ్ర నేతలను కూడా మోసగిస్తోందని 20 సూత్రాల అమలు కమిటీ ఛైర్మన్ తులసిరెడ్డి మండిపడ్డారు. కడపలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా, ప్రజాకాంక్షకు మద్దతుగా పోరాడుతున్న ఎంపీలపై వేటు వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంటూ ఇంకా ముందుకు వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి నూకలు చెల్లుతాయని ఆయన హెచ్చరించారు. విభజనను ఎందుకు వద్దంటున్నారన్నది ఆలోచించాలని అధిష్ఠానానికి ఆయన సూచించారు.