: మోడీ భారత్ కు బ్రాండ్ అంబాసడర్ ఏమీ కాదు: ఖుర్షీద్
విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై ధ్వజమెత్తారు. మోడీ ఎన్నటికీ భారత్ కు బ్రాండ్ అంబాసడర్ కాలేరని పేర్కొన్నారు. భారత్ లో అమెరికా రాయబారి నాన్సీ పావెల్ త్వరలోనే మోడీని కలవనున్నట్టు మీడియాలో వస్తున్న వార్తలపై ఖుర్షీద్ పై విధంగా స్పందించారు. భారతీయతకు ఉదాహరణగా చూపాల్సి వస్తే అది మోడీయే కానక్కర్లేదని అన్నారు. మనమంతా గాంధేయవాదులమని, దయ, ప్రతిఫలాన్ని ఆశించిన సేవాగుణం భారతీయతకు చిహ్నాలని, వీటిలో ఏ ఒక్కటీ మోడీకి లేవని దుయ్యబట్టారు. మోడీతో పావెల్ ఏం మాట్లాడుతుందోనని ఆసక్తిగా ఉందని, గతంలో కొన్ని దేశాలు మానవహక్కుల గురించి ఉపన్యాసాలు దంచాయని, ఇప్పుడు గుజరాత్ లో జరిగిన దానిపై అమెరికా ఏం చెబుతుందో చూడాలని ఖుర్షీద్ అన్నారు.