: ఎంపీల బహిష్కరణకు, బిల్లుకు సంబంధం లేదు: బొత్స
ఏఐసీసీ ఆరుగురు సీమాంధ్ర ఎంపీలను బహిష్కరించడానికి, తెలంగాణ బిల్లుకు సంబంధం లేదని పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, సున్నితమైన రాష్ట్ర విభజన సమస్యతో పార్టీ కొంత ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటోందని అన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు దొరకరని కొంతమంది చేస్తున్న వ్యాఖ్యలు వారి అజ్ఞానానికి చిహ్నంగా నిలుస్తున్నాయని అన్నారు. పార్లమెంటులో ఎవరి ప్రాంతానికి అనుగుణంగా వారు మాట్లాడుతున్నారని, అభిప్రాయాలు చెప్పే స్వేచ్ఛ అందరికీ ఉందని బొత్స తెలిపారు. అందుకనుగుణంగానే తెలంగాణ నేతలు తెలంగాణ బిల్లుకి, సీమాంధ్ర నేతలు సమైక్యానికి మద్దతిస్తున్నారని ఆయన వెల్లడించారు.