: ప్రజల పక్షాన నిలబడ్డాం.. ఎవరికీ భయపడడం లేదు: ఉండవల్లి


తమ బహిష్కరణపై ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం తప్పుమీద తప్పులు చేసుకుంటూ వెళ్తోందని మండిపడ్డారు. తాము ప్రజల పక్షాన నిలబడ్డామని, రాజకీయాల్లో ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీకి సేవ చేశామని, అప్పుడు ప్రజలు తప్పు పట్టలేదని, ప్రజల పక్షాన నిలబడితే కాంగ్రెస్ పార్టీ బహిష్కరిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని ఎలా ఎదుర్కోవాలో తమకు తెలుసని ఉండవల్లి తెలిపారు. అధికారం రక్షించుకోవడం అధిష్ఠానానికి తెలిస్తే, రాష్ట్రాన్ని రక్షించడం తమకు తెలుసని ఉండవల్లి హెచ్చరించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారన్న విషయాన్ని అధిష్ఠానం గుర్తించాలని ఆయన హితవు పలికారు. .

  • Loading...

More Telugu News