: ముందుగా బిల్లు లోక్ సభలోకే: డిగ్గీ రాజా
తెలంగాణ ముసాయిదా బిల్లు ముందుగా లోక్ సభకు వస్తుందని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల పర్యవేక్షకుడైన దిగ్విజయ్ సింగ్ (డిగ్గీరాజా) చెప్పారు. మంగళవారం న్యూఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ముసాయిదా బిల్లులో ఆర్థిక అంశాలు ఉన్నందున ముందుగా లోక్ సభలోనే ప్రవేశపెడతామని ఆయన చెప్పారు. బిల్లుపై న్యాయశాఖ సలహా తీసుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.