: అయిదుగురు అంతర్ రాష్ట్ర దొంగలు అరెస్ట్.. నగలు, నగదు స్వాధీనం
కృష్ణాజిల్లా విజయవాడలో, గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో రెండు వేర్వేరు ఘటనల్లో అయిదుగురు అంతర్ రాష్ట్ర దొంగలు పోలీసుల చేతికి చిక్కారు. దొంగలను అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి విలువైన సొత్తును, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు వాడిన ద్విచక్ర వాహనాలను కూడా సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
విజయవాడలో నలుగురు దొంగలు పట్టుబట్టారు. వారిని తమిళనాడు, చిత్తూరు జిల్లాకు చెందిన అంతర్ రాష్ట్ర దొంగలుగా పోలీసులు గుర్తించారు. నిందితుల వద్ద నుంచి 32 లక్షల 84 వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇక, చిలకలూరిపేటలో ఓ దొంగను అరెస్ట్ చేశారు. అతని నుంచి 27 తులాల బంగారం, 10 తులాల వెండి ఆభరణాలను, రూ. 25 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు చెప్పారు.