: కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు సిగ్గుపడుతున్నా: మంత్రి ఏరాసు
రాష్ట్ర విభజన జరిగితే ముఖ్యమంత్రితో పాటు తామంతా రాజీనామాలు చేస్తామని మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి చెప్పారు. విభజనను ఆపడానికి సీఎం తీవ్రంగా కృషి చేస్తున్నారని అన్నారు. ఈ రోజు ఆయన హైదరాబాదులో మీడియాతో మాట్లాడారు. విభజన జరిగితే రాయలసీమ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతారని తెలిపారు. టీబిల్లులో సీమాంధ్ర ప్రజలకు కలిగే లాభనష్టాలు, నిరుద్యోగం, నీటి లభ్యత, రెవెన్యూ లాంటి అంశాలను పొందుపరచలేదని విమర్శించారు. మూర్ఖంగా ప్రవర్తిస్తున్న కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు తానెంతో సిగ్గుపడుతున్నానని చెప్పారు.