: సీమాంధ్ర కేంద్ర మంత్రులకు సిగ్గులేదు: అశోక్ బాబు


పార్లమెంటులో సీమాంధ్ర ఎంపీలందరూ పోరాటం చేస్తుంటే... సీమాంధ్ర కేంద్ర మంత్రులు మాత్రం సిగ్గు లేకుండా పదవులు పట్టుకుని వేలాడుతున్నారని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు ఘాటుగా విమర్శించారు. ఈ రోజు ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. సమైక్యం కోసం తాము చేస్తున్న ఆందోళనకు చాలా పార్టీల మద్దతు లభిస్తోందని తెలిపారు. విభజనపై జాతీయ స్థాయిలో చర్చ జరగాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఆర్టీసీ కార్మికులు కూడా సమ్మెలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.

  • Loading...

More Telugu News