: ములాయంపై వ్యాఖ్యలకు చింతిస్తున్నా: మంత్రి బేణి ప్రసాద్ వర్మ


సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయంసింగ్ యాదవ్ పై చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి బేణీ ప్రసాద్ వర్మ వెనక్కి తీసుకున్నారు. ములాయంపై ఆరోపణలకు చింతిస్తున్నానని మీడియా ఎదుట చెప్పారు. ఈ మధ్యాహ్నం ఢిల్లీలో ప్రధాని మన్మోహన్ సింగ్ తో బేణి కొద్దిసేపు భేటీ అయ్యారు. ఆ సమయంలోనూ తన వ్యాఖ్యలపై ఆయన విచారం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఉగ్రవాదులతో ములాయంకు సంబంధాలున్నాయంటూ రెండు రోజుల కిందట లోక్ సభలో మంత్రి వ్యాఖ్యానించారు.

వీటిని తీవ్రంగా ఖండించిన సమాజ్ వాదీ నేతలు బేణీ క్షమాపణ చెప్పాలనీ, మంత్రివర్గం నుంచి ఆయనను తప్పించాలని నిన్న, ఈరోజు సభలో డిమాండు చేశారు. అదే సమయంలో స్పందించిన ఓ సీనియర్ మంత్రి ఈ వ్యవహారంపై ప్రధాని నిర్ణయం తీసుకుంటారని అన్నారు. ఈ నేపథ్యంలో బేణి నేడు ప్రధానిని కలిసి వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. మంత్రి బేణి, ములాయం ఇద్దరూ యూపీఏ సంకీర్ణ ప్రభుత్వంలో కీలక వ్యక్తులు కావడంతో సమస్యను తొందరగా పరిష్కరించినట్లు సమాచారం.

  • Loading...

More Telugu News