: అమెరికాలో ఒబామాపై పుకార్ల వెల్లువ


అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాపై పుకార్లు వెల్లువెత్తుతున్నాయి. ఒబామాకు గాయని బియాన్సీ నోయెల్స్ తో లింకుందంటూ ఫ్రెంచి మీడియా కోడై కూస్తుండడంతో అమెరికాలోనూ ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. సదరు ఫ్రెంచి మీడియా ఒబామా వార్త త్వరలోనే వాషింగ్టన్ పోస్ట్ లోనూ ప్రచురిస్తారని పేర్కొనడం విశేషం. అయితే, దీనిపై స్పందించిన వాషింగ్టన్ పోస్ట్ వర్గాలు తమ వద్ద ఒబామాకు సంబంధించిన సమాచారమేమీ లేదని, తాము ఆయనపై కథనాలు ప్రచురించబోవడంలేదని స్పష్టం చేశాయి. కాగా, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే నేడు అమెరికాలో పర్యటిస్తుండగా, నటి జూలియర్ గయెట్ తో ఆయనకు లింకు పెట్టి అమెరికా పత్రికలు ఊదరగొట్టాయి. ఈ నేపథ్యంలో ఫ్రెంచి మీడియా కౌంటర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే, ఒబామా దంపతులకు బియాన్సీ కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఇటీవలే ఒబామా దంపతుల 21వ వివాహ వార్షికోత్సవంలో బియాన్సీ కచేరీ నిర్వహించింది.

  • Loading...

More Telugu News