: ప్రారంభమైన రాజ్యసభ.. రేపటికి వాయిదా
వాయిదాల పర్వం కొనసాగుతోన్న రాజ్యసభ మరోసారి ప్రారంభమయింది. వెంటనే సీమాంధ్ర ఎంపీలు వెల్ లోకి దూసుకెళ్లి సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. సభను కొనసాగనివ్వాలని డిప్యూటీ ఛైర్మన్ ఎంతగా కోరినప్పటికీ... ఆయన మాటను ఎవరూ పట్టించుకోలేదు. దీంతో, రాజ్యసభను రేపటికి వాయిదా వేస్తున్నట్టు డిప్యూటీ ఛైర్మన్ కురియన్ ప్రకటించారు. అంతకు ముందే లోక్ సభ కూడా వాయిదా పడిన సంగతి తెలిసిందే.