: ఎంపీల కృషి సాటిలేనిది.. బీజేపీ మద్దతివ్వదు: అశోక్ బాబు
పార్లమెంటు ఉభయసభలను విజయవంతంగా అడ్డుకోవడంలో సీమాంధ్ర ఎంపీల కృషి సాటిలేనిదని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు తెలిపారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద సీమాంధ్ర విద్యార్ధి జేఏసీ దీక్ష వద్ద ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర విభజన ఆగిపోతుందని అన్నారు. తప్పుల తడకలా తయారైన బిల్లుకు బీజేపీ మద్దతివ్వదని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజలు, విద్యార్థుల ఆవేదనను ఎంపీలు అర్థం చేసుకున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని ఆ పార్టీ ఎంపీలే అడ్డుకోవడం చరిత్రలోనే అత్యద్భుత ఘట్టమని ఆయన అభివర్ణించారు.