: రాజ్యసభలో కుప్పకూలిన డీఎంకే సభ్యురాలు
రాజ్యసభలో ఈ రోజు డీఎంకే సభ్యరాలు ఒకరు సృహతప్పి పడిపోయారు. శ్రీలంక తమిళుల వ్యవహారంలో గట్టిగా నినదిస్తున్న డీఎంకే సభ్యురాలు వాసంతి స్టాన్లీ ఉన్నట్టుండి కుప్పకూలిపోయారు. దీంతో సభలో ఒక్కసారిగా అలజడి రేగింది.
ఆ సమయంలో కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి సభాధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. ఆమె వెంటనే సభను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించి వైద్యులకు సమాచారం అందించారు. వైద్యులు ప్రథమచికిత్స నిర్వహించిన అనంతరం వాసంతి స్టాన్లీని మెరుగైన వైద్య సదుపాయాల కోసం సఫ్దర్ జంగ్ ఆసుపత్రికి తరలించారు.