: ముఖేష్ అంబానీని టార్గెట్ చేసిన కేజ్రీవాల్!


ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ ముఖేష్ అంబానీని టార్గెట్ చేశారు. రిలయన్స్ కంపెనీపై ఢిల్లీ ప్రభుత్వోద్యోగులు తనకు ఫిర్యాదు చేశారని, ఈ క్రమంలో ముఖేష్ అంబానీ, కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ, ఎంపీ మురళీ దేవరా, ఇతరులపై కేసులు నమోదు చేయాలని ఢిల్లీ ఏసీబీని ఆదేశించినట్లు చెప్పారు. ప్రస్తుతం ఏసీబీ ఆ పనిలోనే ఉందన్నారు. ఈ మేరకు ఢిల్లీలో ప్రెస్ మీట్ లో మాట్లాడిన కేజ్రీవాల్ పై విషయం తెలిపారు. అంతేగాక ఈ కేసులో దర్యాప్తు చేయించాలని కోరుతూ ప్రధానమంత్రికి, మొయిలీకి లేఖ రాయనున్నట్లు చెప్పారు. రియలన్స్ కు కేటాయించిన గ్యాస్ బావులను వెనక్కి తీసుకోవాలని కోరనున్నట్లు వివరించారు.

  • Loading...

More Telugu News