: టీ బిల్లు నేడు రాజ్యసభ ముందుకు రాదు: రాజీవ్ శుక్లా
తెలంగాణ బిల్లు ఈ రోజు రాజ్యసభ ముందుకు రాదని కేంద్ర మంత్రి రాజీవ్ శుక్లా తెలిపారు. బిల్లును ముందు రాజ్యసభలో పెట్టాలా? లేక నేరుగా లోక్ సభలోనా? అన్న అంశంపై చర్చ జరుగుతోందని వెల్లడించారు. ఈ మేరకు ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన శుక్లా, ఈ విషయంపై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం ఉండొచ్చన్నారు.