: రాజ్యసభ ఛైర్మన్ వైపు కాగితాలు చింపి వేసిన ఎంపీ మైత్రేయన్
రాజ్యసభలో సీమాంధ్ర ఎంపీలు చేస్తున్న నిరసనకు ఏఐఏడీఎంకే ఎంపీ మైత్రేయన్ రెండు రోజుల నుంచి మద్దతు తెలుపుతున్నారు. ఈ మేరకు సభ ప్రారంభమైన వెంటనే సీమాంధ్ర టీడీపీ ఎంపీలతో పాటు మైత్రేయన్ కూడా ఛైర్మన్ హమీద్ అన్సారీ పోడియం వద్దకు వెళ్లి సభను అడ్డుకుంటున్నారు. ఆ వెంటనే కాగితాలు చింపి ఛైర్మన్ వైపు వేస్తున్నారు.