: సివిల్స్ అభ్యర్థులకు శుభవార్త


ప్రతిభగల ప్రతీ అభ్యర్థి కలల స్వప్నం సివిల్స్. రేయింబవళ్లు కష్టపడి సాధన చేస్తే సాకారమయ్యే విజయం. అయితే, ఇప్పటి వరకు రిజర్వేషన్లు వర్తించని సాధారణ వర్గాల అభ్యర్థులు నాలుగు సార్లు మాత్రమే పోటీ పడటానికి అర్హత ఉండేది. నాలుగు ప్రయత్నాల్లోనూ వారి ఆశయం సిద్ధించకపోతే.. ఇక ఉసూరుమనాల్సిందే. కానీ, ఇకపై ఓసీ కేటగిరీ వారు ఆరు సార్లు సివిల్స్ కు పోటీ పడవచ్చు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అలాగే వయో పరిమితి 30 ఏళ్లుగా ఉండగా దాన్ని కూడా పెంచే ప్రతిపాదన ఉంది.

ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే ప్రస్తుతం ఎన్నిసార్లయినా సివిల్స్ రాసుకునే అవకాశం ఉంది. అది ఇకపైనా కొనసాగుతుంది. ఈ వర్గాల వారికి వయో పరిమితి 35 ఏళ్లు. ఇక ఓబీసీలు అయితే ఏడు ప్రయత్నాల వరకు చేసుకోవచ్చు. వీరికి వయోపరిమితి 32 ఏళ్లుగా ఉంది. ఎటు తిరిగీ ఓసీ కేటగిరీ వారికే నిబంధనలు కొంచెం ప్రతికూలంగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో అది తొలగిపోనుంది.

  • Loading...

More Telugu News