: మధ్యాహ్నం లోక్ సభ వ్యవహారాల కమిటీ భేటీ
లోక్ సభలో టీబిల్లును ప్రవేశపెట్టడం ఇబ్బందికరంగా మారడంతో, రాజ్యసభలో ప్రవేశపెడదామనుకున్న కేంద్రప్రభుత్వానికి ఝలక్ ఇచ్చారు రాజ్యసభ ఛైర్మన్ హమీద్ అన్సారీ. ఆర్థికపరమైన అంశాలున్నాయన్న కారణంతో ముందు లోక్ సభలోనే ప్రవేశపెట్టాలంటూ మోకాలడ్డుతున్నారు. అన్సారీ అభ్యంతరంతో కేంద్రం తన వ్యూహాన్ని మార్చుకుంది. ఈ నేపథ్యంలో ఈ మధ్యాహ్నం 1.15 గంటలకు స్పీకర్ మీరాకుమార్ అధ్యక్షతన లోక్ సభ వ్యవహారాల కమిటీ భేటీ కానుంది. టీబిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టేందుకు తేదీని ఖరారు చేయనుంది. ఇప్పటికే బిల్లును సభలో ప్రవేశపెట్టేందుకు హోంశాఖ రాష్ట్రపతి అనుమతి కోరినట్టు తెలుస్తోంది. బుధవారం లేదా గురువారం బిల్లు పార్లమెంటుకు వచ్చే అవకాశాలున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.