: తూర్పుగోదావరి జిల్లాలో ఇక ‘మెగా’ టూరిజం: చిరంజీవి


తూర్పుగోదావరి జిల్లాలో పర్యాటకాభివృద్ధికి 100 కోట్ల రూపాయల నిధులను కేటాయించినట్లు కేంద్ర పర్యాటక శాఖామంత్రి చిరంజీవి చెప్పారు. రాజమండ్రి-కొవ్వూరు మధ్య గోదావరిపై ఉన్న హేవలాక్ వంతెనను తాము స్వాధీనం చేసుకుని పర్యాటక కేంద్రంగా తీర్చుదిద్దుతామని ఆయన తెలిపారు. ఈ మేరకు రైల్వే మంత్రిత్వ శాఖతో చర్చలు జరుపుతున్నామని ఆయన చెప్పారు.

జిల్లాలో ‘కోనసీమ మెగా టూరిజం సర్క్యూట్’ పేరుతో గోదావరి విహార కేంద్రాలన్నిటినీ ఒకే తాటి పైకి తెస్తున్నామని ఆయన అన్నారు. ఈ విహార కేంద్రాల అభివృద్ధి పనులను చిరంజీవి ప్రారంభించారు. 2013-14 ఆర్థిక సంవత్సరంలో తూ.గో. జిల్లాకు ఇచ్చే 100 కోట్ల నిధుల నుంచి కోనసీమ మెగా టూరిజం సర్క్యూట్ కు 45.88 కోట్ల రూపాయలను వెచ్చిస్తున్నామని ఆయన అన్నారు. అనంతరం కడియపులంకలో ఐదు కోట్ల రూపాయలతో నిర్మించనున్న ఎకో టూరిజం సెంటర్ కు శంకుస్థాపన చేశారు. కోనసీమ నుంచి పాపికొండల మీదుగా భద్రాచలం వరకు ఉన్న పర్యాటక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చిరంజీవి చెప్పారు.

  • Loading...

More Telugu News