: కెఎంపీసీఎల్ పాల ధరలు పెరిగాయ్!
కరీంనగర్ మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ (కెఎంపీసీఎల్) పాల ధర పెంచినట్లు సంస్థ ప్రకటించింది. రవాణా ఖర్చులు, ప్యాకింగ్ సామగ్రి, విద్యుత్ ఛార్జీలు పెరుగుతుండడంతో పెంపు నిర్ణయం తీసుకున్నామని కేఎంపీసీఎల్ ఛైర్మన్ రాజేశ్వరరావు చెప్పారు. ఈ రోజు కంపెనీ ఎండీ హనుమంతరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. లీటరు పాలకు రెండు రూపాయలను పెంచుతున్నట్లు తెలిపారు. సవరించిన ధరలు తక్షణమే అమలులోకి వస్తాయని ఆయన చెప్పారు. ఇక నుంచి, 500 మిల్లీ లీటర్ల టోన్డ్ మిల్క్ 18 రూపాయలు కాగా, అర లీటరు స్వచ్ఛమైన పాలకు 21 రూపాయలుగా నిర్ణయించామని ఆయన పేర్కొన్నారు. పెంచిన ధరలకు అనుగుణంగా రైతులకు చెల్లించే పాల సేకరణ ధరలను కూడా పెంచుతున్నామని ఆయన ప్రకటించారు.