: బాలుడి పొట్ట కోస్తే బతికిన చేప బయటికొచ్చింది!
పశ్చిమ బెంగాల్ లోని మిడ్నపూర్ వద్ద గర్బేటా గ్రామానికి చెందిన ఓ బాలుడు ప్రమాదవశాత్తూ బతికున్న చేపను మింగేశాడు. తన్మయ్ మాలే అనే బాలుడు చేపలు పడుతుండగా, పొరబాటున ఓ చేప ఎగిరి అతని నోట్లో పడింది. అతడు చటుక్కున గుటక వేయడంతో అది కాస్తా పొట్టలోకి వెళ్ళిపోయింది. కాసేపటికి తన్మయ్ కడపు నొప్పితో విలవిల్లాడిపోతుండడంతో అతని కుటుంబ సభ్యులు మిడ్నపూర్ మెడికల్ కాలేజి ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు అల్ట్రా సోనోగ్రఫీ స్కానింగ్ చేస్తే చేప సజీవస్థితిలో ఉదరంలో ఓ మూల కనిపించింది. దీంతో, ఆపరేషన్ చేసిన వైద్యులు ఆ చేపను బయటికి తీశారు. పొట్ట లోపల గోడలకు స్వల్ప గాయాలయ్యాయని, తన్మయ్ కి ప్రమాదమేమీలేదని వారు తెలిపారు.