: దుబాయ్ లోని భారతీయ కార్మికుల కోసం బీమా పాలసీ


దుబాయ్ లో పనిచేస్తున్న ప్రవాస భారతీయులకు శుభవార్త. భారతీయ కార్మికుల కోసం కొత్తగా బీమా సదుపాయం అందుబాటులోకి వస్తోంది. భారత్ నుంచి దుబాయ్ వెళ్లి నాలుగు డబ్బులు వెనకేసుకుందామని వెళ్లే వారికి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. కొంత మంది అయితే మరీ దారుణంగా.. అక్కడ అనాథల్లా ప్రాణాలు కోల్పోతున్నారు. ఆ తరువాత కుటుంబ సభ్యులకు సమాచారం అందుతోంది. దీంతో వారి సమస్యలకు పరిష్కరించేంత సమయం వారికి దొరకడం లేదు. విదేశాలకు వలస కార్మికులుగా వెళ్లి, ఈసీఆర్ (ఇమ్మిగ్రేషన్ చెక్ రిక్వైర్డ్) పాస్ పోర్టులు ఉన్నవారి కోసం భారత ప్రభుత్వం ఓ సామాజిక భద్రతా పథకాన్ని ప్రవేశపెట్టింది.

విదేశాల్లో పనిచేసే భారతీయులు ఎవరైనా సహజ మరణం పొందినా, లేదా ప్రమాదవశాత్తు మరణించినా, ప్రమాదంలో శాశ్వత అంగవైకల్యం కలిగినా వారికి బీమా సదుపాయం కల్పించేందుకు ఈ బీమా పథకాన్ని రూపొందించారు. మహాత్మాగాంధీ ప్రవాసీ సురక్షా యోజన (ఎం.జి.పి.ఎస్.వై) పథకం కింద వలస కార్మికులకు వృద్ధాప్య ఫించన్లు కూడా ఇవ్వనున్నారు. ఈ పథకానికి భారత ప్రభుత్వం కూడా తన వంతు వాటా అందిస్తోంది.

18-50 సంవత్సరాల మధ్య వయసుండి, ఈసీఆర్ పాస్ పోర్టు కలిగి ఉన్న భారతీయులు దుబాయ్ లో తగిన వర్క్ పర్మిట్ లేదా ఉద్యోగ కాంట్రాక్టు కలిగి ఉంటే.. ఈ పథకంలో చేరేందుకు అర్హత లభిస్తుంది. వారు ఫించను లబ్ది కోసం ఏడాదికి వెయ్యి నుంచి 12 వేల రూపాయల వరకు ఆదా చేయాల్సి ఉంటుంది. అలాగే, భారత్ కు తిరిగి వచ్చాక స్థిరపడేందుకు ఏడాదికి అదనంగా నాలుగు వేలు ఆదా చేయాలి. జీవిత బీమా కొరకు ఎలాంటి ప్రీమియం చెల్లించనక్కర్లేదు. గల్ఫ్ దేశాల్లోని భారతీయ కార్మికులకు ఈ తరహా బీమా సేవలను ప్రధానంగా బ్యాంక్ ఆఫ్ బరోడా అందిస్తుంది.

  • Loading...

More Telugu News