: సీఎం రాజీనామా ఊహే: ఏరాసు
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా వార్తలు ఊహాగానాలేనని మంత్రులు ఏరాసు, టీజీ స్పష్టం చేశారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో భేటీ సందర్భంగా వీరీ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి నిర్ణయం తరువాతే రాష్ట్ర విభజనపై పూర్తి స్థాయిలో స్పష్టత వస్తుందని, అప్పుడు ముఖ్యమంత్రి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తారని మంత్రులు పేర్కొన్నారు. కాగా, రాష్ట్రపతి తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే.