: బిల్లును తొలుత రాజ్యసభలో ప్రవేశపెట్టకూడదు: విశాలాంధ్ర మహాసభ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును తొలుత రాజ్యసభలో ప్రవేశపెట్టకూడదని విశాలాంధ్ర మహాసభ ఓ ప్రకటనలో పేర్కొంది. ముసాయిదా బిల్లును ముందు లోక్ సభలోనే ప్రవేశపెట్టాలని సభ తెలిపింది. లోక్ సభలో బిల్లును ఆమోదించిన తర్వాత రాజ్యసభకు పంపాలని విశాలాంధ్ర మహాసభ అభిప్రాయపడింది.