: తెలంగాణ బిల్లుకు మేం వ్యతిరేకం: తృణమూల్


తెలంగాణ బిల్లుకు తృణమూల్ కాంగ్రెస్ వ్యతిరేకమని ఆ పార్టీ స్పష్టం చేసింది. కోల్ కతాలో తృణమూల్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి డెరెక్ ఓబ్రియన్ మాట్లాడుతూ, విభజనను తాము వ్యతిరేకిస్తున్నామని, సమైక్యానికే తమ మద్దతు ఉంటుందని, సమైక్య భారతావనినే కోరుకుంటున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును పార్లమెంటులో వ్యతిరేకిస్తామని ఆయన చెప్పారు. కాగా, చంద్రబాబు నాయుడు తృణమూల్ అధినేత్రి మమతాబెనర్జీని కలసి బిల్లును వ్యతిరేకించాలని విజ్ఞప్తి చేయనున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News