: గుణదలలో ఘనంగా మేరీమాత ఉత్సవాలు


విజయవాడ నగరంలోని గుణదల కొండపై మేరీమాత ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బిషప్ గ్రాసీ స్కూల్ ఆవరణలోని ప్రత్యేక వేదికపై పుణ్యక్షేత్ర గురువులు ఆదివారం నాడు ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ముఖ్యఅతిథిగా హాజరైన గుడివాడ విచారణ జుబిలేరియన్ ఫాదర్ గూడా మెల్కియార్ రాజు భక్తులకు తొలి సందేశం ఇచ్చారు. లోక రక్షకుడైన ఏసుక్రీస్తుకు జన్మనిచ్చిన మరియ (మేరీమాత) పరమ పవిత్రురాలని కీర్తించారు. తొలిరోజు ఉత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

గుణదల పుణ్యక్షేత్రం రెక్టర్ ఫాదర్ మెరుగుమాల చిన్నప్ప, సోషల్ సర్వీస్ సెంటర్ ఫాదర్ మువ్వల ప్రసాద్, చాన్సలర్ పాదర్ జాన్ రాజు, ఫాదర్ వెంపని తదితరులు సమష్టి దివ్యబలిపూజ సమర్పించారు. కతోలిక క్రైస్తవులకు దివ్య ప్రసాదాన్ని అందించారు. మధ్యాహ్నం మరియమాత తేరు ప్రదక్షిణ కార్యక్రమం జరిగింది.

  • Loading...

More Telugu News