: పట్టువీడని టీఆర్ఎస్... శాసనసభ రేపటికి వాయిదా
తెలంగాణ తీర్మానం కోరుతూ టీఆర్ఎస్ సభ్యులు నినాదాలు చేయటంతో ఇవాళ శాసనసభ కార్యక్రమాలకు తీవ్ర విఘాతం కలిగింది. స్పీకర్ ఎంత చెప్పినా టీఆర్ఎస్ సభ్యులు వినకపోవటంతో ఇవాళ రెండో దఫా సమావేశమైనా సభ ఏ వ్యవహారం చేపట్టలేకపోయింది. దీంతో స్పీకర్ సభను రేపటికి వాయిదా వేయాలని నిర్ణయించారు.
కాగా, ఉదయం సభ ప్రారంభం కాగానే మిగిలిన విపక్షాలు సైతం వాయిదా తీర్మానాలపై పట్టుబట్టి సభా కార్యక్రమాలకు అడ్డుతగిలాయి. దీంతో తొలుత సభ అరగంట, అనంతరం రేపటికి వాయిదా పడింది.