: దాహమేసి బావిలో దూకిన ఎలుగు


ఎప్పటిలానే ఈ రోజు కూడా రైతులు పొలం బాట పట్టారు. అక్కడికి సమీపానికి వచ్చే సరికి పెద్ద పెద్ద అరుపులు వినిపిస్తున్నాయి. ఏ వైపు నుంచి వస్తున్నాయో పరిశీలిస్తూ వ్యవసాయ బావి దగ్గరకు చేరుకున్న రైతులు అందులోకి తొంగి చూశారు. భయంతో ఒక్కసారిగా వెనుకడుగు వేశారు. లోపల పేద్ద ఎలుగుబంటి కనిపించింది. ఇది కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం, బంజేరు పల్లె గ్రామంలో జరిగింది.

గ్రామానికి చెందిన రైతు దేవారెడ్డి పొలంలోని వ్యవసాయ బావి వద్ద కనిపించిన దృశ్యమే ఇది. ఈ విషయం అటవీ శాఖాధికారులకు చేరిపోయింది. వారు సరంజామాతో వ్యవసాయ బావి దగ్గరకు చేరుకుని ఎలుగును బయటకు తీయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాహమేసి నీటి కోసం బావి దగ్గరకు వచ్చి ఎలుగు అందులోకి పడిపోయి ఉంటుందని భావిస్తున్నారు. 

  • Loading...

More Telugu News