: సాయంత్రం న్యాయశాఖాధికారులతో రాష్ట్రపతి భేటీ
నేటి సాయంత్రం కేంద్ర న్యాయశాఖాధికారులతో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సమావేశం కానున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు రాష్ట్రపతి వద్దకు చేరిన నేపథ్యంలో బిల్లును యథావిధిగా పార్లమెంటులో ప్రవేశపెట్టడంపై వారితో చర్చించనున్నారు. రాష్ట్రపతి దీనిపై సుప్రీంకోర్టు, న్యాయాధికారుల సలహా తీసుకోవాలని సీనియర్ న్యాయవాదులు అభిప్రాయపడిన సంగతి తెలిసిందే.