: ప్రధానికి రాజీనామాలు సమర్పించిన కేంద్రమంత్రులు
యూపీఏ2 నుంచి వైదొలగాలని డీఎంకే నిర్ణయించిన నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన ముగ్గురు కేంద్రమంత్రులు తమ రాజీనామాలు సమర్పించారు. కొంచెం సేపటిక్రితం వీరు ప్రధాని మన్మోహన్ సింగ్ ని కలిసి తమ రాజీనామా లేఖలు ఇచ్చారు. ప్రధానికి రాజీనామాలు సమర్పించిన మంత్రులు వరుసగా.. జగద్రక్షకన్, గాంధీ సెల్వన్,పళనీ మాణిక్యం.
కాగా, ఇద్దరు మంత్రులు (అళగిరి, నెపోలియన్) మాత్రం ఇంకా తమ రాజీనామాలు సమర్పించలేదు. దీంతో డీఎంకేలో ముసలం మొదలైందంటూ పలురకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, దీనిపై డీఎంకే నేత టీఆర్ బాలు స్పందిస్తూ తమ పార్టీలో ఏ విభేదాలు లేవని వివరణ ఇచ్చారు.