: రాష్ట్ర విభజన ప్రక్రియ చివరి దశలో ఉంది: పీసీసీ చీఫ్ బొత్స
రాష్ట్ర విభజన ప్రక్రియ చివరి దశలో ఉందని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. ముఖ్యమంత్రి రాజీనామా విభజన ప్రక్రియపై ఎలాంటి ప్రభావం చూపదని ఆయన అన్నారు. సీఎం కిరణ్ తన రాజీనామాను ఆరు నెలల క్రితమే చేసి ఉంటే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. సోమవారం ఆయన మీడియా ప్రతినిధులతో ముచ్చటిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
సీడబ్ల్యూసీ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్నప్పుడే రాజీనామా చేసి ఉంటే ఏమైనా ప్రభావం ఉండేదని బొత్స చెప్పారు. ఎన్నికల్లో ముందుండి నడిపించే ముఖ్యమంత్రి.. ఇప్పుడు తన బాధ్యతను విస్మరించడం సరి కాదని బొత్స పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఇవాళ గవర్నర్ నరసింహన్ తో భేటీ అయ్యారు. ఈ భేటీ నేపథ్యంలో సీఎం రాజీనామా చేస్తారా? లేదా? అనే చర్చలు మరింత జోరందుకున్నాయి.