: ప్రధాని విందు వ్యూహం.. బీజేపీ ముఖ్య నేతలకు ఆహ్వానం
పార్లమెంటు సమావేశాలకు సభ్యులు అదే పనిగా అడ్డుతగులుతూ ఉండడంతో ముఖ్యమైన బిల్లులను పార్లమెంటులో గట్టెక్కించేందుకు ప్రధాని మన్మోహన్ సింగ్ రంగంలోకి దిగారు. బీజేపీ సహకారంతో సులువగా గట్టెక్కవచ్చనే ఉద్దేశంతో ఆ పార్టీకి చెందిన ముఖ్య నేతలు కొందరిని ప్రధాని రేపు విందుకు పిలిచారు. అద్వానీతోపాటు లోక్ సభ, రాజ్యసభలో విపక్ష నేతలుగా ఉన్న సుష్మాస్వరాజ్, అరుణ్ జైట్లీలను వ్యక్తిగతంగా ప్రధాని విందుకు ఆహ్వానించారని సమాచారం. ముందుగా ఈ విందు సమావేశాన్ని సోమవారమే ఏర్పాటు చేయగా.. అద్వానీ గుజరాత్ కు వెళ్లడంతో రేపటికి వాయిదా పడిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.