: అసెంబ్లీ తిరస్కరించిన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడం సరికాదు: ఫరూక్ అబ్దుల్లా


తెలంగాణ బిల్లును ఆమోదించిన కేంద్ర కేబినేట్ భేటీలో తాను లేనని కేంద్రమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తిరస్కరించిన తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజనకు సంబంధించిన రూపొందించిన ముసాయిదా బిల్లులో తప్పులు దొర్లాయని ఆయన విమర్శించారు.

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం శుక్రవారం ఆమోదముద్ర వేసిన విషయం విదితమే. రాష్ట్ర శాసనసభ, శాసన మండలిల్లో బిల్లుపై చర్చ జరిగిన అనంతరం.. కేంద్రానికి తిప్పి పంపిన ఈ బిల్లును యథాతథంగా పార్లమెంటు ముందు ఉంచాలని తీర్మానించింది.

  • Loading...

More Telugu News