: ఇకపై బస్సుల్లో జీపీఎస్ తప్పనిసరి


ఆధునిక పరిజ్ఞానాన్ని ప్రజా రవాణా వ్యవస్థలో విరివిగా ఉపయోగించుకోవాలని కేంద్రం భావిస్తోంది. దేశంలో 10 లక్షలకు పైబడి జనాభా కలిగివున్న నగరాల్లో బస్సులు ఇకపై తప్పనిసరిగా జీపీఎస్ (గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్) పరికరాలను కలిగి ఉండాలని ఆదేశించింది. అందుకు గాను ప్రజా రవాణా వ్యవస్థలకు ఫిబ్రవరి 20ని గడువుగా విధించింది. తాజా ఉత్తర్వుల ప్రకారం నిర్దేశిత సమయంలోపు జీపీఎస్ పరికరాలను బస్సుల్లో అమర్చకపోతే చర్యలుంటాయని స్పష్టం చేసింది. కిందటి నెలలో కేంద్ర ఆర్థిక వ్యవహారాల కమిటీ ప్రజా రవాణా వ్యవస్థను జీపీఎస్ ద్వారా పర్యవేక్షణ-పరిశీలన, బస్సుల్లో అలారం బటన్స్ వంటి భద్రత ఏర్పాట్ల కోసం రూ.1405 కోట్లతో ఓ భారీ ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపింది. ఈ వ్యవస్థలో సీసీటీవీలు, జీపీఎస్ ద్వారా మహిళల భద్రతకు భరోసా ఇవ్వాలన్నదే కేంద్రం ఉద్దేశం. దేశంలో స్త్రీల భద్రత కోసం ఏర్పాటు చేసిన నిర్భయ నిధిలో నుంచి ఈ ప్రాజెక్టుకు నిధులు విడుదల చేస్తారు.

  • Loading...

More Telugu News