: ప్రభుత్వరంగ బ్యాంకుల్లో కార్యకలాపాలు బంద్
వేతన సవరణ ప్రధాన డిమాండ్ తో ప్రభుత్వరంగ బ్యాంకుల ఉద్యోగులు నేటి నుంచి సమ్మెలో పాల్గొంటున్నారు. రేపటి వరకూ సమ్మె కొనసాగనుంది. దీంతో బ్యాంకుల్లో కార్యకలాపాలు నిలిచిపోయాయి. ప్రైవేటు రంగ బ్యాంకులు యథావిధిగానే పనిచేస్తున్నాయి. వేతన సవరణ కోసం ఈ బాట పట్టాల్సి వచ్చిందని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ కన్వీనర్ మురళి తెలిపారు.ఈ నెల 6న జరిగిన సమావేశంలో 10 శాతం వేతనాల పెంపునకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ముందుకు రాగా, దీన్ని ఉద్యోగ సంఘాలు వ్యతిరేకించాయి. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతన పెంపు లేదని నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ వర్కర్స్ జనరల్ సెక్రటరీ అశ్విని రాణా అన్నారు.